- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి
ఢిల్లీలోని పాలం ప్రాంతంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం రేఖా గుప్తా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం (Delhi Fire Accident) సంభవించింది. పాలం ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున నాలుగు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ సర్వీస్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఎక్స్ వేదికగా స్పందిస్తూ పాలంలోని బహుళ అంతస్తుల నివాస భవనంలో జరిగిన దురదృష్టకరం అని ఈ ఘటనతో తాను తీవ్రంగా కలత చెందానని పోస్టు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు
ఈవీ వాహనానికి ఛార్జింగ్ పెట్టి పడుకున్న కుటుంబం.. తెల్లారేసరికి ఏడుగురు సజీవదహనం
Next Story






