- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Railway Station Accident : యూపీలో ఘోర ప్రమాదం.. కూలిన రైల్వే స్టేషన్ పైకప్పు
యూపీ(UP)లో ఘోర ప్రమాదం జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : యూపీ(UP)లో ఘోర ప్రమాదం జరిగింది. కనౌజ్ రైల్వే స్టేషన్లో(Kannauj Railway Station) ఓ భవనం పైకప్పు కూలిపోయింది(Roof Collapsed). స్టేషన్లో కొత్తగా నిర్మిస్తున్న భవనం కింద కార్మికులు మధ్యాహ్న భోజనాలు చేస్తున్న సమయంలో ఆ భవనం పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దాదాపు 30 మందికి పైగా కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం. కాగా సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి అదిత్యనాథ్(CM Yogi Adithyanath) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని తక్షణమే బయటికి తీసుకు వచ్చేలా చూడాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పేర్కొన్నారు.






