నగ్రోటలో ఆర్మీ స్టేషన్ వద్ద కాల్పులు.. జవాన్‌కు స్వల్ప గాయాలు

by Phanindra |

జమ్మూలోని నగ్రోట ఆర్మీ స్టేషన్ వద్ద కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఒక జవాన్‌కు స్వల్పగాయాలయ్యాయి.

నగ్రోటలో ఆర్మీ స్టేషన్ వద్ద కాల్పులు.. జవాన్‌కు స్వల్ప గాయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూలోని నగ్రోట ఆర్మీ స్టేషన్ వద్ద జరిగిన గన్‌ఫైర్‌లో ఒక భారతీయ జవాన్ గాయపడ్డారు. ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ‘ఆర్మీ స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని మా జవాన్ గమనించి హెచ్చరించారు. దీంతో ఆ అనుమానితుడు కాల్పులు జరిపాడు. మా సెంట్రీకి చిన్న గాయమైంది. కాల్పులు జరిపిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాం’ అని ఆర్మీ తెలిపింది. సరిహద్దుల వద్ద పాకిస్తాన్ డ్రోన్ దాడులు, కాల్పులు చేపడుతున్న సమయంలోనే ఆ ఘటన జరగడం గమనార్హం.

Next Story