- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సొంత పెళ్లిలో వరుడు వింత డిమాండ్.. ఎంత బతిమిలాడినా నో యూజ్
పెళ్లి భోజన సమయంలో వరుడు చేసిన డిమాండ్ అక్కడున్న బంధువులను ఆశ్చర్యపరిచింది. అతడు మంకుపట్టు పట్టడంతో అక్కడున్నవారంతా బతిమిలాడినా ప్రయోజనం లేకపోయింది.

దిశ, డైనమిక్ బ్యూరో: వరకట్న నిషేధ చట్టం అమలులో ఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఇంకా కట్నం కోసం వధువు తరఫువారిని వేధిస్తున్న వారు ఇంకా ఉన్నారు. తమకు కట్నం రూపంలో ఇస్తామన్న నగదు, నగలు, వాహనాలు ఇవ్వకపోతే పెళ్లి మండపంలోనే అందరి ముందు రచ్చ చేస్తున్న సంఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇటీవల తనకు ఇస్తానన్న స్కార్పియో వాహనం ఇవ్వలేదని రాజస్థాన్ లో పెళ్లి మండపం నుంచి వరుడు పరారైన ఘటన మరువక ముందే తాజాగా మరో షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. తనకు గోల్డ్ చైన్ బహుమతిగా ఇస్తేనే భోజనం చేస్తానని ఓ పెళ్లి కొడుకు మంకుపట్టు పట్టాడు.
ఎంత బతిమిలాడిన నో యూజ్:
ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియనప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నదాని ప్రకారం పెళ్లి వేడుక జరుగుతుండగా భోజనం చేయడానికి వరుడు అతని పక్కన బంధువులు కూర్చున్నాడు. ఆ సమయంలో తనకు ఇస్తామన్న బంగారు గొలుసు ఇస్తేనే తింటానని లేదంటే భోజనం ముట్టేది లేదంటూ పెళ్లికొడుకు మొండికేశాడు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. వరుడి డిమాండ్ పై అక్కడున్న బంధువులు ఎంత సర్ది చెప్పాలని చూసినా వరుడు మాత్రం ససేమీరా ఒప్పుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు వరుడి ప్రవర్తనపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ వరుడి డిమాండ్ అందరి ముందు అమర్యాద మాత్రమే కాదు నాన్ బెయిలబుల్ కేసు కూడా. వధువు తల్లిదండ్రులు నగల విషయంలో బుజ్జగించే బదులు 112 హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి ఉంటే సదరు వరుడి రాత్రి భోజనంతో పాటు హనిమూన్ కూడా జైల్లోనే జరిగేదంటూ సెటైర్ వేయగా మరో నెటిజన్ స్పందించగా ఇదంతా సంప్రదాయంలో భాగంగా వస్తోందని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ విడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.






