భారత్ - పాక్ సరిహద్దులో దారుణం.. ఒక జవాన్ మృతి

by Gantepaka Srikanth |

జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

భారత్ - పాక్ సరిహద్దులో దారుణం.. ఒక జవాన్ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పూంఛ్ జిల్లాలో ఎల్‌వోసీ వద్ద మందుపాతర పేలి ఒక జవాన్ అక్కడికక్కడే దుర్మరణం(Army Soldier Dead) చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం భారత్ - పాకిస్తాన్ మధ్య సరిహద్దుగా ఉన్న నియంత్రణ రేఖ(LOC) వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story