- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువత బొద్దింకల వెంట నడిచే పరిస్థితి వస్తుంది.. భారత ఉపరాష్ట్రపతి సెన్సేషనల్ కామెంట్స్
పాజిటివ్ వార్తలను మీడియా చూపించకపోతే యువత తప్పుదోవ పట్టే అవకాశం ఉందని భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హెచ్చరించారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సానుకూల పరిణామాలు, సాధిస్తున్న విజయాలను ప్రజలకు మీడియా సరైన మార్గంలో చూపకపోతే యువత తప్పుడు మార్గంలో వెళ్లే ప్రమాదం ఉందని భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) హెచ్చరించారు. ఇవాళ ఆయన ఢిల్లీలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మంచి వార్తను విస్మరిస్తే (Positive News) విస్మరిస్తే, యువత చివరికి ‘బొద్దింక’ (Cockroach)లను అనుసరించే పరిస్థితి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒకప్పుడు దేశంలో తప్పుడు ప్రచారం చేసే శక్తుల గురించి ఎవరికీ తెలియదు, కానీ ఇప్పుడు అంతటా వారే కనిపిస్తున్నారని రాధాకృష్ణణ్ కామెంట్ చేశారు. మీడియా కేవలం నెగిటివ్ అంశాలకే ప్రాధాన్యత ఇస్తూ, దేశం సాధిస్తున్న అద్భుతమైన వృద్ధిని, సానుకూల పరిణామాలను తగినంతగా చూపించకపోవడం వల్లే ఇలాంటి శక్తులు బలపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశం 2047 నాటికి ‘వికసిత్ భారత్’గా మారాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని, ఈ ప్రయాణంలో యువత పాత్ర అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. యువతలో ఉన్న నిరుత్సాహాన్ని తొలగించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలంటే దేశం సాధించిన విజయాలను, మంచి పనులను వార్తల రూపంలో విస్తృతంగా చేరవేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సీపీ రాధాకృష్ణణ్ పిలుపునిచ్చారు.






