- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళనాడులో సంచలన పరిణామం.. అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు ఖరారు
తమిళనాడులో సంచలన పరిణామం చోటు చేసుకుంది..

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు(Tamil Nadu)లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే(AIADMK)తో బీజేపీ(Bjp) పొత్తు ఖరారు అయింది. ఈ మేరకు అధికారికంగా కేంద్రహోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) ప్రకటించారు. ప్రధాని మోడీ(Pm Modi), అన్నాడీఎంకే అధ్యక్షుడు పళనిస్వామి(AIADMK President Palaniswami) భాగస్వామ్యంతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల(Tamil Nadu Assembly Elections)కు వెళ్తామని చెప్పారు. ఎన్డీయే కూటమి(NDA alliance) భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు. అధికారం, సీట్ల పంపకాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాలను జోక్యం చేసుకోమని అమిత్ షా పేర్కొన్నారు.
అలాగే తమిళనాడులో బీజేపీ అధ్యక్ష మార్పుపై ఆయన ట్వీట్ చేశారు. ‘‘తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ అధ్యక్ష పదవికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. బీజేపీకి అన్నామలై ప్రశంసనీయ సేవలందించారు. మోదీ విధానాలు ప్రజలకు చేరవేయడంతో సఫలమయ్యారు. జాతీయ స్థాయిలో అన్నామలై నైపుణ్యాలు వినియోగించుకుంటాం. అన్నామలై సహకారం మరవలేనిది.’’ అని అమిత్‌షా పేర్కొన్నారు.






