భారతీయ రైల్వే అరుదైన రికార్డు.. 180 కి.మీ వేగంతో దూసుకెళ్లిన వందే భారత్ స్లీపర్

by Malleboina Mahesh |

భారతీయ రైల్వే సరికొత్త సాంకేతిక అద్భుతాన్ని ఆవిష్కరిస్తూ వందే భారత్ స్లీపర్ రైలును విజయవంతంగా పరీక్షించింది.

భారతీయ రైల్వే అరుదైన రికార్డు.. 180 కి.మీ వేగంతో దూసుకెళ్లిన వందే భారత్ స్లీపర్
X

దిశ, వెబ్ డెస్క్: భారతీయ రైల్వే సరికొత్త సాంకేతిక అద్భుతాన్ని ఆవిష్కరిస్తూ వందే భారత్ స్లీపర్ రైలు (Vande Bharat Sleeper Train)ను విజయవంతంగా పరీక్షించింది. రాజస్థాన్‌లోని కోటా-నాగ్డా రైల్వే సెక్షన్ మధ్య బుధవారం జరిగిన ఈ హైస్పీడ్ ట్రయల్ రన్‌ (High-speed trial run)లో ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించి సరికొత్త రికార్డు సృష్టించింది. రైల్వే సేఫ్టీ కమిషనర్ (CRS) పర్యవేక్షణలో జరిగిన ఈ పరీక్షలో, రైలు అత్యంత వేగంతో వెళ్తున్నప్పటికీ లోపల ఎలాంటి కుదుపులు లేకపోవడం విశేషం. ఈ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ఒక వీడియోను పంచుకుంటూ, ఈ 'న్యూ జనరేషన్' రైలు ('New Generation' Train) దేశీయ రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది అని పేర్కొన్నారు.

ఈ రైలు సాధించిన అత్యున్నత స్థిరత్వాన్ని (Stability) నిరూపించేందుకు నిర్వహించిన 'వాటర్ టెస్ట్' ('Water test') అందరినీ ఆశ్చర్యపరిచింది. గంటకు 180 కి.మీ వేగంతో రైలు దూసుకుపోతున్న సమయంలో టేబుల్‌పై ఉంచిన నీటి గ్లాసులు కనీసం కదలకపోవడం, ఒక్క నీటి చుక్క కూడా కింద పడకపోవడం భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది. అత్యాధునిక సస్పెన్షన్ సిస్టమ్, అధునాతన బ్రేకింగ్ వ్యవస్థ (Advanced braking system) కవచ్ భద్రతా ఫీచర్లతో రూపొందిన ఈ స్లీపర్ రైలు త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇది సుదూర ప్రయాణాలను మరింత వేగవంతం చేయడమే కాకుండా, ప్రయాణికులకు విమాన ప్రయాణం తో సమానమైన సౌకర్యాన్ని మరియు నిశ్శబ్దమైన అనుభవాన్ని అందిస్తుందని రైల్వే శాఖ ధీమా వ్యక్తం చేసింది.

Next Story