- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Plane Crash : యువతను మింగేసిన విమాన ప్రమాదం!
అమెరికా(America) వాషింగ్టన్ సమీపంలోని రోనాల్డ్ రీగన్ విమానాశ్రయంలో దిగబోతున్న విమానాన్ని ఆర్మీ హెలిక్యాప్టర్ ఢీ కొట్టిన(Plane Helicopter Crash) ప్రమాదంలో 67మంది చనిపోయిన(Dead) ఘటనలో ఎక్కువ మంది యువతీ యువకులే(Most Of Them Are Young Men And Womens) ఉండటం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా(America) వాషింగ్టన్ సమీపంలోని రోనాల్డ్ రీగన్ విమానాశ్రయంలో దిగబోతున్న విమానాన్ని ఆర్మీ హెలిక్యాప్టర్ ఢీ కొట్టిన(Plane Helicopter Crash) ప్రమాదంలో 67మంది చనిపోయిన(Dead) ఘటనలో ఎక్కువ మంది యువతీ యువకులే(Most Of Them Are Young Men And Womens) ఉండటం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఎయిర్ పోర్ట్‌లో విమానం ల్యాండ్ అయ్యే క్రమంలో రక్షణ శాఖకు చెందిన హెలికాప్టర్ ఢీ కొనడంతో ఆ రెండు కూడా పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. దీంతో ప్రమాదంలో విమానంలో ఉన్న 60మంది ప్రయాణికులు, 4గురు సిబ్బంది, ఆర్మీ హెలిక్యాప్టర్ లోని ముగ్గురు సైనికులు దుర్మరణం చెందారు. నదిలో నుంచి ఇప్పటికే సగం మంది మృతదేహాలను వెలికి తీశారు.
అయితే ఈ విమాన ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న అమెరికా(USA) ఐస్ స్కేటింగ్ టీమ్ యువ క్రీడాకారులు(Ice Skating Team Young Players) మొత్తం 16మంది చనిపోవడం మరింత విషాదాన్ని రగిల్చింది. ప్రమాదానికి గురైన విమానాన్ని ఎక్కే ముందు వారంతా కేరింతలతో దిగిన గ్రూపు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోను చూసిన వారంతా ఒకేసారి అంతమంది టీనేజర్ ప్లేయర్లు విమానం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. విమానం కాన్సాస్‌లోని విచిత నుంచి వాషింగ్టన్ డీసీకి ప్రయాణిస్తోంది. విమానం ల్యాండ్ కాబోతున్న సమయంలో.. మరికొద్ది క్షణాల్లో ఏయిర్ పోర్టులో ప్రయాణికులతో పాటు దిగాల్సి ఉన్న సమయంలో స్కేటింగ్ టీమ్ యంగ్ ప్లేయర్స్ అంతా దుర్మరణం చెందడం వారి కుటుంబాలను విషాదంలో ముంచేసింది.
అటు ప్రమాదంలో కూలిపోయిన 12వ ఏవియేషన్ బెటాలియన్‌కి చెందిన హెలికాప్టర్ మృతులు సైతం సాధారణ శిక్షణ పొందుతున్న ముగ్గురు యువ సైనికులే కావడం గమనార్హం. ఎంతో భవిష్యత్తు ఉన్న స్కేటింగ్ క్రీడాకారులు, సైనికులు అనుకోని ప్రమాదంలో చనిపోవడం పట్ల సర్వత్రా సానుభూతి వ్యక్తమవుతోంది.
గత 24 ఏళ్లలో అమెరికాలో ఇదే అతిపెద్ద విమాన ప్రమాదమని.. విమానం తలకిందులుగా నది అడుగుభాగంలో కూరుకుపోయిందని, అక్కడికి దగ్గర్లోనే హెలికాప్టర్ శకలాలను కూడా గుర్తించామని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న జాన్ డొన్నెలీ తెలిపారు. వాషింగ్టన్‌లోని వైట్‌హౌజ్, క్యాపిటల్ భవనానికి కేవలం మూడు మైళ్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రపంచంలో అత్యంత నియంత్రణ కలిగిన గగనతలంలో ఈ ప్రమాదం జరగడం గమనార్హం. రన్‌వేకు 2,400 అడుగుల దూరంలో, భూమికి 400 అడుగుల ఎత్తులో, గంటకు 140 మైళ్ల వేగంతో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు విమానంలోని రేడియో ట్రాన్స్‌పాండర్ డాటాను బట్టి తెలుస్తున్నది.
‘మీకు ఎదురుగా విమానం కనిపిస్తున్నదా?’ అని హెలికాప్టర్ పైలట్‌ను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు అడుగుతుండగానే ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ దుర్ఘటనతో అమెరికా దుఃఖంలో మునిగిపోయిందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఎయిర్ కంట్రోలర్ల ఎంపికలో మాజీ అధ్యక్షులు ఒబామా, బైడెన్ అవలంభించిన విధానాల వల్లే ప్రమాదం జరిగిందని ట్రంప్ మండిపడ్డారు.






