- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మారిజోనా తాగి మర్మాంగాన్ని కోసుకున్న ఘనడు.. దాని కోసమేనట! (వీడియో)
సమాజానికి ఏదైనా చెడు జరగబోతోందని ఆందోళనతో ఇలా చేసినట్లు తెలిపాడు. A Man In Assam Chops Off His Own Penis.

దిశ, వెబ్‌డెస్క్ః అసోంలోని సోనిత్‌పూర్ జిల్లాలో ఓ వ్యక్తి గంజాయి మత్తులో పురుషాంగాన్ని కోసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. మే 19న సోనిత్‌పూర్ జిల్లాలోని దేకర్ గ్రామానికి చెందిన ఎండీ సహజుల్ అలీ గంజాయి తాగి, మానసిక స్థితి చెదిరిన క్షణంలో ఈ చర్యకు పాల్పడ్డాడు. అయితే, అప్పుడు అలీ మానసికంగా కలవరంతో ఉన్నట్లు తర్వాత తెలిసింది. అయితే, ఈ వ్యక్తి చేసిన ఘనకార్యం ఇదొక్కటే కాదు, ఇంతకుముందు కూడా అలీ మత్తులో ఉండి సింహంతో ఒక రాత్రి గడపాడని తెలిసింది. మీడియా నివేదికల ప్రకారం, అలీ గంజాయి మాత్రమే కాకుండా ఇతర హార్డ్ డ్రగ్స్‌లో కూడా తీసుకుంటాడని సమాచారం. అయితే, అతని మర్మాంగాన్ని కోల్పోయిన ఈ సైకోసిస్ ఎపిసోడ్ గంజాయి ప్రభావంతో జరిగిందని పోలీసులు తెలిపారు.
అలీ గౌహతి టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఇలా ఎందుకు చేశాడో వివరించాడు. తన పాపాలకు పశ్చాత్తాపం పొందడానికే తన పురుషాంగాన్ని కత్తిరించుకున్నట్లు చెప్పాడు. అంతేకాదు, అలీ చెప్పిన మాటల్లో, ధూమపానం తన మతంలో పాపంగా పరిగణించబడుతుందని, అయితే తాను మత్తుకు అలావాటు పడ్డాననీ, తాను మతాన్ని వ్యతిరేకించడం వల్ల సమాజానికి ఏదైనా చెడు జరగబోతోందని ఆందోళనతో ఇలా చేసినట్లు తెలిపాడు. ప్రస్తుతం అలీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.






