గుడిలో పాడు పని చేస్తూ పట్టుబడిన ప్రేమజంట.. దేహశుద్ధి చేసిన గ్రామస్తులు

by Disha Web Desk 6 |
గుడిలో పాడు పని చేస్తూ పట్టుబడిన ప్రేమజంట.. దేహశుద్ధి చేసిన గ్రామస్తులు
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో చాలా మంది ప్రేమికులు బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. తమ చుట్టూ జనాలు ఉన్నారని కూడా మరచిపోయి భాగస్వామితో రోమాన్స్‌లో మునిగి తేలుపోతున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. కొన్ని వీడియోల ఆధారంగా అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకున్నా కొంత మందిలో ఇంకా మార్పు రావడం లేదు. తాజాగా, జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో ఓ ప్రేమ జంట ఎక్కడా ప్లేస్ లేనట్టు ఏకంగా పవిత్రమైన గుడిలో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయారు.

వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలోని నిర్సా నయాదంగ కాళీ టెంపుల్‌లో ఓ ఇద్దరు ప్రేమికులు గుడిలో పాడు పని చేస్తూ గ్రామస్తులకు పట్టుబడిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఓ అమ్మాయి, అబ్బాయి పవిత్రమైన గుడిలో అసభ్యకరంగా ఉండగా స్థానికులు పట్టుకున్నారు. ఆ జంటతో పాటు వారి స్నేహితుడిని కూడా పట్టుకుని దేహశుద్ధి చేశారు. అంతటితో ఆగకుండా వారిని మోకాళ్లపై కూర్చోబెట్టి తమదైన శైలిలో బుద్ధి చెప్పారు. దీంతో ఆ జంట తమను క్షమించమని వేడుకున్నప్పటికీ వారిని వదిలిపెట్టలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.



Next Story

Most Viewed