- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎట్టకేలకు కుదిరిన ఒప్పందం.. ఏడు సీట్లు ఎక్కువ దక్కించుకున్న బీజేపీ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే (AIADMK) మరియు బీజేపీ (BJP) పార్టీల మధ్య పొత్తు కుదిరింది. సుదీర్ఘ చర్చల అనంతరం సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. ఈ పొత్తులో భాగంగా బీజేపీకి 27 అసెంబ్లీ స్థానాలను కేటాయించేందుకు అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి అంగీకరించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీకి ఏడు అదనపు సీట్లు దక్కడం విశేషం. దాంతో పాటు అన్నాడీఎంకే సారథ్యంలోని ఈ కూటమిలో ఇప్పటికే ఉన్న పీఎంకే (PMK) పార్టీకి 18 స్థానాలు, టీటీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే (AMMK) పార్టీకి 11 స్థానాలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. పొత్తుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మరియు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి సంతకాలు చేశారు.
ఓట్లు చీలకుండా..
డీఎంకే-కాంగ్రెస్ కూటమిని బలంగా ఎదుర్కోవాలంటే ఓట్లు చీలకుండా ఉండాలని, అందుకే పాత మిత్రపక్షాలన్నీ మళ్ళీ ఏకం కావాలని నిర్ణయించుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో పట్టున్న ఏఎంఎంకే, ఉత్తర ప్రాంతంలో బలం ఉన్న పీఎంకేతో పాటు జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీ తోడవడంతో ఈ కూటమి గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.






