- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దళపతి విజయ్‌కు ముగిసిన సీబీఐ విచారణ.. స్టేట్‌మెంట్ రికార్డు
తమిళనాడులో కీలక పరిణామం చోటు చేసుకుంది..

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు(Tamilnadu)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కరూర్ తొక్కిసలాట ఘటన(Karur Tokkisalata Incident)లో నటుడు, దళపతి, తమిళ వెట్రికళగం వ్యస్థాపక అధ్యక్షుడు విజయ్(Vijay)ను సీబీఐ(Cbi) అధికారులు విచారించారు. దాదాపు 7 గంటలపాటు ఆయన్ను ప్రశ్నించారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై ఆయన స్టేట్ మెంట్‌ను రికార్డ్ చేశారు. సభ నిర్వహణ, లోపాలు, భద్రతా వైఫల్యాలపైనా ఆరా తీశారు.
విజయ్ సభలో తొక్కిసలాట
కాగా 2025, సెప్టెంబర్ 27న తమిళనాడు రాష్ట్రం కరూర్ జిల్లా వేలుస్వామిపురంలో టీవీకే పార్టీ తరపున ఓ రాజకీయ జరిగింది. ఈ సభకు విజయ్ అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. అయితే సభ మధ్యలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 41 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. దీంతో సీబీఐ అధికారులు కేసు దర్యాప్తు చేశారు.టీవీకే పార్టీకే చెందిన పలువురు నాయకులను ఇప్పటికే ప్రశ్నించారు. తాజాగా తమ ఎదుట హాజరుకావాలని సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో విజయ్ సోమవారం విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు ఆయన్ను విచారించారు. విచారణ ముగియడంతో విజయ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ పరిణామంతో విజయ్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.






