అమెరికా జీతమే కాదు.. ఉద్యోగం కూడా కాస్లీనే గురూ

by Malleboina Mahesh |

రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ భారత పౌరులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా పగబట్టినట్లే వ్యవహరిస్తున్నారు.

అమెరికా జీతమే కాదు.. ఉద్యోగం కూడా కాస్లీనే గురూ
X

దిశ, వెబ్‌డెస్క్: రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ భారత పౌరులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా పగబట్టినట్లే వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే కఠిన నిర్ణయాలు తీసుకున్న ట్రంప్.. తాజాగా అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి బిగ్ షాక్ ఇచ్చాడు. H1B వీసా దరఖాస్తు రుసుము (H1B Visa Application Fee) సంవత్సరానికి 100,000 డాలర్లు (రూ. 83-90 లక్షలు)కు పెంచుతూ ఒక కీలక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ నిర్ణయం విదేశీ నిపుణులు, ముఖ్యంగా భారతీయ ఐటీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపనున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, టాటా కన్సల్టెన్సీ వంటి కంపెనీలు H1B వీసాల ద్వారా వేలాది మంది విదేశీ ఉద్యోగులను నియమించుకుంటాయి. ఈ భారీ ఫీజు పెంపు వల్ల కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడంలో ఇకపై ఆచితూచి అడుగేయనున్నాయి.

భారతీయుల కలలపై తీవ్ర ప్రభావం..

తాజాగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం తో భారత్ లోని అనేక మందిపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా పేద మధ్యతరగతి వారు ఇకపై అమెరికాకు వెళ్లడం సాధ్యపడదు. ఈ నిర్ణయం వల్ల చిన్న, మధ్య తరహా కంపెనీలు, స్టార్టప్‌లు H-1B వీసాల స్పాన్సర్‌షిప్‌ను పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉంది. భారత్ సహా ఇతర దేశాల నుంచి అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఉద్యోగ అవకాశాలు తగ్గే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే అమెరికాపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం కూడా కనిపిస్తుంది.

ఏది ఏమైనప్పటికి H1B వీసా ఫీజు భారీగా పెరగడం వల్ల భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థులకు అమెరికాలో ఉద్యోగ అవకాశాలు కష్టతరం కానున్నట్లు స్పష్టమవుతుంది. కంపెనీలు ఈ ఖర్చు తగ్గించుకునేందుకు స్థానిక నియామకాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే ఆయా కంపెనీలు కెనడా, యూరప్ వంటి ఇతర దేశాల్లో టెక్ హబ్‌లను అభివృద్ధి చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ రెండిటిలో ఏది జరిగిన భారతీయ యువతకు అమెరికాకు వెళ్లాలనే కలను మరింత కష్టతరం చేసే అవకాశం ఉంది.

రూ 90 లక్షలు ఉంటేనే అమెరికాలో ఉద్యోగం..

ఈ రోజు ట్రంప్ తీసుకున్న H1B వీసాల స్పాన్సర్‌షిప్‌ పెంపు నిర్ణయం భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపనుంది. భారతదేశం నుంచి ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు, ఐటీ నిపుణులు అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం H1B వీసాలపై ఆధారపడతారు. ఈ ఫీజు పెంపు వల్ల కంపెనీలు ఖర్చును తగ్గించుకునేందుకు భారతీయుల నియామకాన్ని తగ్గించేందుకు అవకాశం ఉంది. దీంతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న, చేయాలనుకునే పౌరులపై తీవ్ర ప్రభావం పడనుంది. అలాగే ఈ నిర్ణయం భారత్-అమెరికా సంబంధాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అమెరికాపై ప్రభావం

H-1B వీసాల స్పాన్సర్‌షిప్‌ పెంపు నిర్ణయంతో ఇతర దేశాలతో పాటు అమెరికాపై కూడా తీవ్ర ప్రభావం చేయనున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. H-1B వీసాల ద్వారా వచ్చే నైపుణ్యం కలిగిన ఉద్యోగులు టెక్ రంగంలో ఆవిష్కరణలకు దోహదం చేస్తారు. ఈ వీసాల సంఖ్య తగ్గితే, అమెరికా టెక్ రంగం పోటీతత్వం లో కెనడా, యూరప్ వంటి దేశాలకు వెనుకబడే ప్రమాదం ఉంది. అయితే ట్రంప్ మరోసారి ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు. గతంలో తీసుకున్న ఇలాంటి నిర్ణయాలతో ట్రంప్‌కు కోర్టు మొట్టికాయలు వేసిన విషయం తెలిసిందే.

Next Story