సామాన్యులకు భారీ ఊరట.. బీపీ, షుగర్ మందులు ఇకపై చౌక

by Naga Rani Yarlagadda |

సామాన్యులకు భారీ ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

సామాన్యులకు భారీ ఊరట.. బీపీ, షుగర్ మందులు ఇకపై చౌక
X

దిశ, వెబ్‌డెస్క్: సామాన్యులకు భారీ ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 35 రకాల నిత్యావసర మందుల రిటైల్ ధరలను తగ్గిస్తున్నట్లు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో షుగర్, గుండె సంబంధిత వ్యాధులు, హైబీపీ, పెయిన్ రిలీఫ్, యాంటీబయాటిక్ వంటి కీలక మందుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి.

డాక్టర్ రెడ్డీస్ (Doctor Redd's) మార్కెటింగ్ చేస్తున్న ఏసెక్లోఫెనాక్, పారాసెటమాల్, ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ కాంబినేషన్ టాబ్లెట్ ధరను ఎన్‌పీపీఏ రూ.13గా నిర్థారించింది. ఇదే ఫార్ములేషన్ తో క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ విక్రయించే ట్యాబ్లెట్ ధరను రూ.15.01గా నిర్ణయించారు. అలాగే గుండె జబ్బులకు వాడే అటోవాస్టాటిన్ (40 MG), క్లోపిడోగ్రెస్ (75 MG) టాబ్లెట్ రేటు రూ.25.61గా నిర్థారించారు. విటమిన్ డి (Vitamin D) లోపం ఉన్నవారు వాడే కోలికాల్సిఫెరాల్ డ్రాప్స్ మెడిసిన్, చిన్న పిల్లలకు ఇచ్చే సెఫిక్సిమ్, పారాసెటమాల్ ఓరల్ సస్పెన్షన్, నొప్పి నివారణకు వాడే డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ వంటి మెడిసిన్స్ ధరలు కూడా తగ్గాయి.

Next Story