- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీవ్ర విషాదం.. ఐదుగురు జర్నలిస్టుల దుర్మరణం
గాజా (Gaza) నగరంలోని అల్-షిఫా (Al-Shifa) ఆసుపత్రి సమీపంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: గాజా (Gaza) నగరంలోని అల్-షిఫా (Al-Shifa) ఆసుపత్రి సమీపంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ (Israel) వైమానిక దాడిలో ఐదుగురు అల్ జజీరా మీడియా హౌస్ (Al Jazeera Media House)కు చెందిన ఐదుగురు జర్నలిస్టులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులలో అల్ జజీరా కరస్పాండెంట్లు అనస్ అల్-షరీఫ్, మహమ్మద్ క్రీకీ, కెమెరామెన్లు ఇబ్రహీం జహీర్, మొమెన్ అలీవా, మహమ్మద్ నౌఫల్ ఉన్నట్లుగా ఆ సంస్థ బ్రాడ్‌కాస్టర్ వెల్లడించింది.
అల్-షిఫా ఆసుపత్రి ప్రధాన గేట్ వెలుపల ప్రెస్ కోసం ఏర్పాటు చేసిన టెంట్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఇజ్రాయెల్ దాడిలో ఏడుగురు మరణించారని అల్ జజీరా తెలిపింది. దాడి తర్వాత అనస్ అల్-షరీఫ్ (Anas Al-Sharif)ను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం అంగీకరించింది. అతడొక తీవ్రవాదని, హమాస్‌లోని ఒక తీవ్రవాద సెల్‌కు లీడర్‌గా వ్యవహరించాడని వారు పేర్కొన్నారు. 28 ఏళ్ల అల్-షరీఫ్ తన మరణానికి కొద్ది క్షణాల ముందు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేస్తూ.. గాజా నగరంలో ఇజ్రాయెల్ బాంబు దాడులను తీవ్రతరం చేసిందని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.






