- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లైంగిక వేధింపులకు లొంగలేదు.. బస్సులోనే న్యాయం చేసిన అమ్మాయి!
బస్సులో పక్క సీటులో కూర్చున్న ఓ వ్యక్తి.. యువతి ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పబ్లిక్ ప్లేసులు, బస్సుల్లో మహిళలపై లైంగిక వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహిళలు ఒంటరిగా కన్పిస్తే చాలు, వారిపై దౌర్జన్యాలకు కొందరు పోకిరీలు పాల్పడుతున్నారు. ఇలాంటివి అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వేధింపులు మాత్రం ఆగడం లేదు. అయితే, కొంత మంది మహిళలు మాత్రం ఎదురునిలిచి ఆకతాయిలకు చుక్కలు చూయిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బస్సులోనే కామాంధుడికి ఓ మహిళ గుణపాఠం చెప్పింది.
యువతి ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ..
సోషల్ మీడియాలో వైరల్ వీడియో ప్రకారం.. బస్సులో పక్క సీటులో కూర్చున్న ఓ వ్యక్తి.. యువతి ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. యువతి నివారిస్తున్నా.. మళ్లీ మళ్లీ అసభ్యకరంగా తారకడంతో యువతి తగిన బుద్ధి చెప్పింది. సాక్ష్యం కోసం వీడియో తీసి.. లైంగిక వేధింపులకు లొంగకుండా.. బస్సులోనే అమ్మాయి ఆ కామాంధుడి చెంపలు వాయించేసింది. కేరళలో చోటు చేసుకున్న ఘటన, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆ కామాంధుడిపై మండిపడుతున్నారు. కూతురు వయస్సు ఉన్న అమ్మాయితో ఇదేం పని అని ఫైర్ అయ్యారు. బస్సులో అంతమంది ఉన్నా ఒక్కరూ స్పందించి మాట్లాడకపోవడం దారుణం అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరోవైపు ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్‌లు కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తప్పు యువతిదే అవుతుందా?
ఇప్పుడు ఆ వ్యక్తి సూసైడ్ చేసుకుంటే.. తప్పు యువతిదే అవుతుందా? అని నెటిజన్‌లు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల కేరళ బస్సులో జరిగిన సంఘటనను నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. వడకరకు చెందని షింజిత ముస్తఫా అనే యువతి బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో దీపక్ అనే వ్యక్తి అసభ్యంగా తాకినట్లు వైరల్ కావడంతో ఆ వ్యక్తి సూసైడ్ చేసుకున్న విషయం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.






