ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ఛ్ లోపం.. ఎయిరిండియా విమానం నిలిపివేత

by Kema Shiva Kumar |

ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు సర్వసాధారణం అయ్యాయి.

ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ఛ్ లోపం.. ఎయిరిండియా విమానం నిలిపివేత
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు సర్వసాధారణం అయ్యాయి. జరిగిన ప్రతి ఘటనలో పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, తాజాగా ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. లండన్‌ (London)లోని హీత్రూ (Heathrow) విమానాశ్రయం నుంచి బెంగళూరు (Bengaluru)కు బయలుదేరాల్సిన ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ (AI 132) విమానాన్ని సాంకేతిక లోపం కారణంగా నిలిపివేశారు.

ఇంజిన్ స్టార్ట్ చేసే సమయంలో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ (Fuel Control Switch) సరిగ్గా పనిచేయకపోవడాన్ని పైలట్లు ముందే గుర్తించారు. ఎడమ వైపు ఉన్న ఫ్యూయల్ స్విచ్ రన్ పొజిషన్‌లో ఉండకుండా, రెండుసార్లు ఆటోమేటిక్‌గా కటాఫ్ పొజిషన్‌కు మారిపోయినట్లు తేలింది. అయితే, ఇటీవల జరిగిన AI-171 విమాన ప్రమాదానికి కూడా ఇటువంటి ఫ్యూయల్ స్విచ్ లోపమే కారణమనే అనుమానాలు ఉండటంతో ఈ తాజా ఘటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

పైలట్ ఫిర్యాదు మేరకు అప్రమత్తమైన ఎయిరిండియా యాజమాన్యం ఆ విమానాన్ని వెంటనే నిలిపివేసింది. అనంతరం విమాన తయారీ సంస్థ అయిన బోయింగ్‌తో (Boeing) కలిసి ఎయిరిండియా ఫ్లైట్ టెక్నీషియన్లు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా జరిగిన ఘటనపై పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA)కు కూడా ఇప్పటికే సమాచారం అందింది. ప్రస్తుతం ఈ విమానంలోని ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంపై విమానయాన సంస్థ ఎయిరిండియా దృష్టి సారించింది. గతంలోనే తమ విమానాలన్నింటిలో ఫ్యూయల్ స్విచ్‌లను తనిఖీ చేశామని ఆ సంస్థ ప్రకటించింది.

Next Story