- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో మరో ట్విస్ట్..
సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) దాడి కేసులో మరో ట్విస్ట్ బయటకొచ్చింది. నిందితుడు షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలను పోలీసులు సేకరించగా.. దాడి జరిగిన ప్రదేశంలో లభించిన ఫింగర్ ప్రింట్స్ తో ఇవి సరిపోవటం లేదని వార్తలొస్తున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) దాడి కేసులో మరో ట్విస్ట్ బయటకొచ్చింది. నిందితుడు షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలను పోలీసులు సేకరించగా.. దాడి జరిగిన ప్రదేశంలో లభించిన ఫింగర్ ప్రింట్స్ తో ఇవి సరిపోవటం లేదని వార్తలొస్తున్నాయి. జనవరి 16 తెల్లవారుజామున నిందితుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశాడు. అయితే, విచారణలో భాగంగా నటుడి ఇంటిని పరిశీలించిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ టీం అక్కడ దాదాపు 19 ఫింగర్ ప్రింట్స్ ని సేకరించింది. వాటిల్లో ఏ వేలిముద్ర కూడా నిందితుడి ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ కావట్లేదని ఫోరెన్సిక్ బృందం తెలిపినట్లు సమాచారం. తదుపరి పరీక్షల కోసం మరోసారి ఘటనా స్థలం నుంచి మరిన్ని వేలిముద్రల నమూనాల్ని సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు.
బ్లడ్ శాంపిల్స్..
మరోవైపు, కేసు విచారణ కోసం ముంబై పోలీసులు సైఫ్ బ్లడ్ శాంపిల్స్ ని, దాడి జరిగిన రోజు ఆయన ధరించిన దుస్తులను సేకరించారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. అయితే, నిందితుడైన షరీఫుల్ ఇస్లాం దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే సైఫ్ ఇంట్లోకి ప్రవేశించాడని.. అయితే, పరిస్థితి తీవ్ర ఘర్షణకు దారితీసిందని ప్రాథమిక విచారణలో తేలింది. అందుకే, దాడి సమయంలో సైఫ్ ధరించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి దుస్తులపై రక్తపు మరకలు కనిపించడంతో అవి సైఫ్ అలీఖాన్‌వేనా.. కాదా అని నిర్ధరించడం కోసం నమూనాలు సేకరించారు. దుండగుడి దుస్తులను, సైఫ్ రక్తనమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు అధికారులు తెలిపారు.






