- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యోగా చేసిన శునకం.. చూసినవారంతా మంత్రముగ్ధులవ్వాల్సిందే!
ఈనెల 21న జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఈనెల 21న జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International Yoga Day) దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్‌లోని (Jammu Kashmir) ఉధంపూర్‌లో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ (NDRF) 13వ బెటాలియన్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక యోగా సెషన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే.. అక్కడ యోగా సాధనలో ఓ శునకం పాల్గొంది. ఈ శునకాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది దత్తత తీసుకొని గత రెండు సంవత్సరాలుగా శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో యోగా ఆసనాలపై అభిరుచి పెంచుకొని, జవాన్లతో పాటు ప్రతిరోజూ యోగా చేయడం ప్రారంభించింది.
తాజాగా జరిగిన ఈ ప్రత్యేక యోగా కార్యక్రమంలో శునకం తడబడకుండా తాడాసన, భుజంగాసన, అష్టాంగ నమస్కారంలాంటి ఆసనాలను చక్కగా ప్రదర్శించి అందరి హృదయాలను గెలుచుకుంది. తన చురుకైన ప్రదర్శనతో ఈ శునకం మొత్తం కార్యక్రమానికి హైలైట్‌గా మారింది. అక్కడున్న యోగా గురువులు, అధికారులు ఈ శునకాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ అరుదైన యోగా దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాల్లో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఈ శునకాన్ని 'యోగాసనాల్లో సూపర్‌స్టార్' అంటూ కామెంట్లు చేస్తున్నారు.






