ఢిల్లీ వీధుల్లో చక్కర్లు కొట్టిన అమృతపాల్ సింగ్.. సీసీటీవీ ఫుటేజ్ లభ్యం

by Dishafeatures2 |
ఢిల్లీ వీధుల్లో చక్కర్లు కొట్టిన అమృతపాల్ సింగ్.. సీసీటీవీ ఫుటేజ్ లభ్యం
X

దిశ, వెబ్ డెస్క్: సిక్కులకు ప్రత్యేక దేశం కావాలంటూ డిమాండ్ చేస్తూ దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిస్ పంజాబ్ దే చీఫ్, ఖలిస్థానీ నాయకుడు అమృతపాల్ సింగ్ పరారీలో ఉన్నాడు. ఆయన ఆచూకీ కోసం పంజాబ్ పోలీసులు, కేంద్ర బలగాలు గాలింపు చేపట్టాయి. అయితే డెనిమ్ జాకెట్, సన్ గ్లాసెస్ ధరించి.. తలపాగా లేకండా అమృతపాల్ సింగ్ ఢిల్లీ నడివీధుల్లో చక్కర్లు కొడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో అమృతపాల్ సింగ్ తో పాటు అతడి అనుచరుడు పాపాల్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నాడు. ఇద్దరూ ముఖానికి మాస్క్ ధరించారు. ఈ నెల 18న అమృతపాల్ పంజాబ్ నుంచి తప్పించుకోగా.. ఈ నెల 21న యధేచ్ఛగా ఢిల్లీ వీధుల్లో చక్కర్లు కొట్టినట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది.

అమృతపాల్ సింగ్, పాపాల్ ప్రీత్ సింగ్ హర్యానాలోని కురుక్షేత్ర గుండా ఢిల్లీకి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ప్రస్తుతం వారిద్దరూ ఢిల్లీలోనే దాక్కున్నారా లేక వేరే చోటుకు పారిపోయారా అనే విషయం మాత్రం తెలియరాలేదని పోలీసులు చెబుతున్నారు. ఇక ఇప్పటికే పలు మారువేషాల్లో తప్పించుకు తిరుగుతున్న అమృతపాల్ సింగ్ కు సంబంధించిన వీడియోలు మీడియాకు చిక్కాయి. వాటి ఆధారంగా పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అయితే తాజాగా ఢిల్లీకి సంబంధించిన వీడియో పోలీసుల ఇన్వెస్టిగేషన్ కు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.



Next Story

Most Viewed