- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జమ్మూ కశ్మీర్‌లో లోయలో పడ్డ బస్సు..ఇద్దరు మృతి
by B.Srinivas |
జమ్మూ కశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఓ ప్రయివేటు మినీ బస్సు 200 అడుగుల లోతైన లోయలో పడింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఓ ప్రయివేటు మినీ బస్సు 200 అడుగుల లోతైన లోయలో పడింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..28 మంది ప్రయాణికులతో కూడిన బస్సు శనివారం భలెస్సా నుంచి థాత్రికి వెళ్తుండగా..దోడా జిల్లాకు సమీపంలో అదుపుతప్పి 200 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. దీంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో మహిళ పరిస్థితి విషమించి ఆస్పత్రిలో మరణించింది. విషయం తెలుసుకున్న భారత సైన్యం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దోడాలోని ఆస్పత్రికి తరలించారు. మొత్తం 25 మందికి గాయాలు కాగా అందులో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రమాదానికి గల కారణాలను వెల్లడించలేదు.
Next Story






