- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణ ఘటన.. కెనడాలో భారత సంతతి వ్యాపారవేత్త హత్య
ఇటీవల కాలంలో కెనడాలో హిందూ ఆలయాలు, భారతీయులపై దాడులు ఎక్కువయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో కెనడాలో (Canada) హిందూ ఆలయాలు, భారతీయులపై దాడులు ఎక్కువయ్యాయి. తాజాగా మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్తను దారుణంగా హత్యచేశారు. వివరాల్లోకి వెళ్లితే.. భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త హర్‌జీత్ దడ్డా అనే వ్యక్తి కెనడాలో నివసిస్తున్నాడు. ఒంటారియో, మిసిసాగా పార్కింగ్ లాట్‌లో ఆయనపై కొందరు దుండగులు విచక్షణరహితంగా కాల్పులు జరిపి, పారిపోయారు. కుటుంబసభ్యులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ మేరకు హర్‌జీత్ కుమార్తె గుర్లీన్ తన తండ్రి మృతిపై ఓ ప్రకటన విడుదల చేసింది. తన తండ్రికి అనేకసార్లు బెదిరింపులు వచ్చాయని, కాపాడాలని పోలీసులను వేడుకున్నప్పటికీ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తమను కాపాడాల్సిన వ్యవస్థ విఫలమైందని ఆరోపించింది. మరోవైపు హర్‌జీత్ హత్యకు తమదే బాధ్యత అని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించినట్లు సమాచారం.






