లేటు వయసులో ఘాటు ప్రేమ.. 25 ఏళ్ల కుర్రాడిని పెళ్లి చేసుకున్న 55 ఏళ్ల మహిళ పారిశ్రామికవేత్త

by Prasad Jukanti |   (  Updated:2026-04-06 08:39:28  IST  )

తనకంటే వయస్సులో 30 ఏళ్లు చిన్న వాడిని ఓ మహిళా పారిశ్రామిక వేత్త వివాహం చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

లేటు వయసులో ఘాటు ప్రేమ.. 25 ఏళ్ల కుర్రాడిని పెళ్లి చేసుకున్న 55 ఏళ్ల మహిళ పారిశ్రామికవేత్త
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని అంటుంటారు. ఇది నిజం అని నిరూపించేలా ఇటీవల కాలంలో ఏజ్ గ్యాప్ రిలేషన్ షిప్‍లు కామన్‍గా జరిగిపోతున్నాయి. తాజాగా చైనాలో (China) అచ్చం ఇలాంటి ఓ పెళ్లి చేసుకున్న జంట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. 55 ఏళ్ల వయసులో తన కంటే 30 ఏళ్లు చిన్నవాడైన యువకుడిని పెళ్లి చేసుకుని ఆ మహిళ అందరిని ఆశ్చర్యపరిచింది. అంతే కాదు అతడిని తన వాడిని చేసుకునేందుకు ఏకంగా రూ. 68 కోట్లు ఎదురు కట్నం ఇచ్చి అతడిని దక్కించుకోవడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ లవ్ బర్డ్స్ గురించిన డిస్కషన్ జరుగుతోంది. ఈ అరుదైన వివాహానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

తన కంపెనీకి పని చేసిన వాడితో ప్రేమాయణం:

చైనాకు చెందిన యూ వెన్‍హాంగ్ (55) (Yu Wenhong) ప్రముఖ మహిళా వ్యాపార వేత్త. మెడికల్ కాస్మెటిక్స్ వ్యాపారంలో అమె తిరుగులేని శక్తిగా కొనసాగుతున్నారు. అయితే ఆమెకు 2025లో తన కంపెనీలోనే మోడల్‍గా పని చేసిన లియు యుచెన్ (25)
(Liu Yuchen)
అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి డేటింగ్ వరకు వెళ్లింది. తన కంటే వయసులో చాలా చిన్నవాడైనప్పటికీ లియు యుచెన్ ప్రేమలో యు వెన్‌హాంగ్ లీనమైపోయింది. దీంతో అతడిని పెళ్లి చేసుకుని తన వాడిగా చేసుకోవాలని భావించి గత నెలలో వివాహమాడింది. ఈ క్రమంలో తన భర్తకు రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంచ్ వంటి లక్జరీ కార్లతో పాటు విలాసవంతమైన ఇళ్లు కానుగా ఇచ్చింది. వీటిలో కొన్ని తాము డేటింగ్ చేస్తున్న సమయం నుంచి ఇచ్చిన బహుమతులు ఉన్నాయి. ఈ బహుమతుల విలువ సుమారు 50 మిలియన్ యువాన్లు అంటే దాదాపు రూ.60 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

ఇతని కంటే ముందే మరో ఆరుగురు:

సాధారణంగా పెళ్లికొడుకు తరపు వారు కట్నం తీసుకోవడం చూస్తుంటాం. కానీ ఇక్కడ యు వెన్‌హాంగ్ స్వయంగా తన భర్తకు సుమారు రూ. 68 కోట్లు విలువైన నగదు, ఆస్తులు మరియు విలాసవంతమైన వస్తువులను ఎదురు కట్నం ఇచ్చి వివాహం చేసుకోవడంతో ఈ మ్యారేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ డిస్కషన్‍గా మారింది. దీంతో యు వెన్‌హాంగ్ లేటు వయసులో తన బాయ్ ఫ్రెండ్‍ను దక్కించుకుంటే, లియు యుచెన్‌ యంగ్ ఏజ్ లోనే రిచ్చెస్ట్ గర్ల్ ఫ్రెండ్‍ను వివాహం చేసుకోగలిగారని ఈ జంటను గురించి అంతా చర్చించుకుంటున్నారు. అయితే సదరు మహిళకు ఇది ఆరో పెళ్లి కావడం గమనార్హం. ఇప్పటి వరకు ఉన్న తమ జీవిత భాగస్వాములకు గుడ్ బై చెప్పి ఇప్పుడు ఈ 25 ఏళ్ల కుర్రాడిని తన కొంగుకు ముడేసుకోవడం కొసమెరుపు.
Next Story