ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న సైనికులకు అరుదైన గౌరవం

by Gantepaka Srikanth |

ఆపరేషన్ సిందూర్‌(Operation Sindoor)లో పాల్గొన్న సైనికులకు అరుదైన గౌరవం దక్కింది.

ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న సైనికులకు అరుదైన గౌరవం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ సిందూర్‌(Operation Sindoor)లో పాల్గొన్న సైనికులకు అరుదైన గౌరవం దక్కింది. తొమ్మిది మంది వాయుసేన అధికారులకు కేంద్రం వీర్ చక్ర(Vir Chakra) పురస్కారాలు ప్రకటించింది. పాకిస్తాన్‌లోని మిలిటరీ స్థావరాలపై దాడి చేసిన నేపథ్యంలో వీరిని ప్రభుత్వం గౌరవిస్తోంది. మరోవైపు 79వ స్వాతంత్య్ర దినోత్సవం(Independence Day) సందర్భంగా పోలీసు, భద్రతా సిబ్బందికి కేంద్రం పురస్కారాలను ప్రకటించింది. 99 మందికి రాష్ట్రపతి పతకాలు, 233 మందికి గ్యాలంటరీ అవార్డులు, 758 మందికి మెరిటోరియస్ సర్వీస్ పతకాలు లభించాయి. వీటిని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్నారు.

Next Story