- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ ఉగ్రదాడి కేసు.. స్పాట్‌లో 9 ఎంఎం బుల్లెట్లు స్వాధీనం
ఇటీవల దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ఓ కారు బాంబు బ్లాస్ట్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ఓ కారు బాంబు బ్లాస్ట్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీని వెనుక ఉగ్ర సంస్థ ఉన్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో నిర్ధారణ అవ్వగా.. అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్లను అరెస్ట్ చేశారు. బ్లాస్ట్ పాల్పడిన ఉమర్ నబీ కూడా డాక్టరేనని తేల్చారు. కాగా.. తాజాగా ఈ ఉగ్రదాడి కేసులో మరో సంచలన విషయం తెరపైకి వచ్చింది. బ్లాస్ట్ జరిగిన ప్రాంతంలో మూడు 9 ఎంఎం బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాలు, పోలీసులు వాడే బుల్లెట్లు ఉమర్ నబీకి ఎలా అందాయన్న కోణంలో ఢిల్లీ పోలీసులు విచారణ చేస్తున్నారు. స్పాట్ లో తుపాకీ మాత్రం ఇంకా లభించలేదని తెలిపారు. బుల్లెట్లను మాత్రమే ఎందుకు క్యారీ చేశాడు? తుపాకీతో కాల్చి చంపాలని ఉమర్ నబీ ప్లాన్ చేశాడా? అని లోతైన విచారణ చేస్తున్నారు.






