- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pune: మహారాష్ట్రలో ఆగి ఉన్న బస్సును ఢీకొన్న మిని వ్యాన్
మరో ఎనిమిది మంది గాయపడినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని పూణె-నాసిక్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తొమ్మిది మందిని బలితీసుకుంది. ఆగి ఉన్న బస్సుని టెంపో ఢీకొనడంతో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం..ఈ ఘటన నారాయణగావ్ సమీపంలో ఉదయం 9.30 గంటల సమయంలో జరిగింది. మినీవ్యాన్ నారాయణగావ్ వైపు వెళ్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ఒక టెంపో వాహనం దాన్ని ఢీకొట్టింది. దాంతో రోడ్డు పక్కనే ఆగి ఉన్న బస్సును మినీవ్యాన్ ఢీకొంది. టెంపో డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో తొమ్మిది మంది అక్కడే చనిపోయారని పూణె రూరల్ పోలీసు సూపరింటెండెంట్ పంకజ్ దేశ్‌ముఖ్ చెప్పారు. స్థానికుల నుంచి సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగే తీరులో వాహనాన్ని పార్క్ చేసినందున బస్సు డ్రైవర్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు దేశ్‌ముఖ్ తెలిపారు. టెంపో డ్రైవర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.






