- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆలయంలో తీవ్ర విషాదం.. 9 మంది చిన్నారులు మృతి
by Gantepaka Srikanth |
మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా షాపూర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆలయం గోడ కూలి తొమ్మిది మంది చిన్నారులు మృతిచెందారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా షాపూర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆలయం గోడ కూలి తొమ్మిది మంది చిన్నారులు మృతిచెందారు. మరి కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకొని హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పందించి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. కాగా, ఆదివారం సెలవు దినం కావడంతో శివలింగాన్ని తయారు చేసేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఘటనలో మరణించిన చిన్నారుల్లో దివ్యాన్ష్, వంశ్, నితేష్, ధ్రువ్, దివ్యరాజ్, సుమిత్ ప్రజాపతి, ఖుషి, పర్వ్ విశ్వకర్మ అనే చిన్నారులు ఉన్నారని అధికారులు నిర్ధారించారు.
Next Story






