ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న గ్యాంగ్ అరెస్ట్.. బాధితుల సంఖ్య 100కు పైనే

by Disha Web Desk 17 |
ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న గ్యాంగ్ అరెస్ట్.. బాధితుల సంఖ్య 100కు పైనే
X

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఉద్యోగాల పేరుతో మోసగిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేటు ఎయిర్ లైన్స్‌లో ఉద్యోగాల పేరుతో సుమారు 100 మందికి పైగా నిరుద్యోగులను మోసగించిన 9 మందితో కూడిన గ్యాంగ్‌ను గురువారం అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. సులువుగా డబ్బు సంపాదించేందుకు ముఠాలో చేరేందుకు ఇతరులను ప్రలోభపెట్టి కలిసి కుట్ర పన్నినట్లు గుర్తించారు. ప్రధాన నిందితులు అమీర్, శివమ్‌లను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.

నోయిడా, ఉత్తమ్ నగర్, ద్వారకా కేంద్రాలుగా ఈ గ్యాంగ్ కార్యనిర్వహణ చేస్తుందని చెప్పారు. ఉద్యోగార్థులను లక్ష్యంగా చేసుకుని వెబ్‌సైట్ల ద్వారా సమాచారం తీసుకుని అభ్యర్థులను నమ్మించినట్లు విచారణలో తేలింది. అయితే ప్రాంతాలు మారడంతో వారిని పట్టుకోవడంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తినట్లు చెప్పారు. అయితే ఈ గ్యాంగ్ అభ్యర్థుల నుంచి ఎంత డబ్బులు వసూలు చేశారనే విషయమై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. బాధితులు ఇచ్చిన పక్కా సమాచారం ఆధారంగా జరిపిన సోదాల్లో 9 మొబైల్ ఫోన్లు, బ్యాంక్ అకౌంట్ కిట్‌తో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.


Next Story

Most Viewed