కర్నాటక రిజల్ట్: బీజేపీకి షాక్.. 8 మంది మంత్రులు వెనుకంజ!

by Disha Web Desk 19 |
కర్నాటక రిజల్ట్: బీజేపీకి షాక్.. 8 మంది మంత్రులు వెనుకంజ!
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ రేపుతోంది. ఇవాళ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీకి ఓటర్లు షాకిస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీకి చెందిన 8 మంది మంత్రులు వెనుకంజలో కొనసాగుతున్నారు. మంత్రులు అశోక్, సోమన్న, సుధాకర్, శ్రీరాములు, జార్కిహోలి వెనుకంజలో ఉన్నారు. చిక్ మగళూర్ స్థానంలో సీటీ రవి సైతం వెనుకంజలో కొనసాగుతున్నారు. ఇక, బీజేపీ నుండి కాంగ్రెస్‌కు మారిన మంత్రి సవాదీ లీడింగ్‌లో కొనసాగుతున్నారు. కర్నాకటలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో ముందంజలో దూసుకుపోతుంది.

Also Read...

కర్నాటక రిజల్ట్: భారీ అధిక్యంలో కాంగ్రెస్.. ముందంజలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్



Next Story

Most Viewed