- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాంగ్ రూట్లో ట్రక్కును ఢీకొట్టిన కారు.. 8 మంది మృతి
పరిమితికి మించి ప్రయాణికులతో వెళుతున్న ఓ తుఫాన్ (Toofan) కారు ట్రక్కును ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: పరిమితికి మించి ప్రయాణికులతో వెళుతున్న ఓ తుఫాన్ (Toofan) కారు ట్రక్కును ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 18 మంది ప్రయాణికులతో వెళుతుండగా 8 మంది మరణించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారితో సహా 8 మంది మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన రాజస్థాన్(Rajasthan)లోని సిరోహి జిల్లా(sirohi) పిండ్వారా ప్రాంతంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే పరిమితికి మించి ప్రయాణికులు ఉండడమే కాకుండా రాంగ్ రూట్లో ప్రయాణిస్తుండడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ట్రక్కును తుఫాన్ వెహికల్ ఢీకొన్నట్లు తెలుస్తోంది.
Next Story






