Bus Accident : కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు.. 8 మంది మృతి.. 18 మందికి గాయాలు

by Hajipasha |

దిశ, నేషనల్ బ్యూరో : పంజాబ్‌(Punjab)లోని భటిండా(Bathinda) జిల్లా జీవన్ సింగ్ వాలా గ్రామ శివార్లలో ఘోర ప్రమాదం జరిగింది.

Bus Accident : కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు.. 8 మంది మృతి.. 18 మందికి గాయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : పంజాబ్‌(Punjab)లోని భటిండా(Bathinda) జిల్లా జీవన్ సింగ్ వాలా గ్రామ శివార్లలో ఘోర ప్రమాదం జరిగింది. తల్వండీ సాబో నుంచి భటిండా నగరం వైపు వెళ్తున్న బస్సు(Bus Accident) అతివేగం కారణంగా అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోగా, ముగ్గురు తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు.

చనిపోయిన వారి వివరాలను ఇంకా గుర్తించలేదు. గాయాలపాలైన మరో 18 మందికి షహీద్ భాయ్ మణిసింగ్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. వర్షం కురుస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. జీవన్ సింగ్ వాలా గ్రామస్తులు చొరవచూపి కాల్వలో పడిన వారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు.

Next Story