- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pahalgam Attack: పాక్ కు 786 మంది.. భారత్ కు 1,376 మంది
పహెల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై దౌత్యపరమైన కఠిన చర్యలను అమలు చేస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై దౌత్యపరమైన కఠిన చర్యలను అమలు చేస్తోంది. ఇందులోభాగంగా ఆయా వీసాల కింద భారత్‌లో ఉన్న పాక్ పౌరులు స్వదేశానికి వెళ్లిపోతున్నారు. పాక్ లో ఉన్న భారతీయులు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇందులోభాగంగా ఏప్రిల్ 24-29 మధ్య పంజాబ్‌లోని అటారీ- వాఘా సరిహద్దు గుండా 786 మంది పాకిస్థానీయులు కార్‌కు వెళ్లగా.. అదే సమయంలో అక్కడినుంచి 1,376మంది భారతీయులు తిరిగి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా.. ప్రజలకు ఇచ్చిన గడువు ముగిసిపోవడంతో కేంద్రం ఆదేశాల మేరకు బుధవారం అధికారులు అటారీ- వాఘా సరిహద్దును మూసివేశారు. ఏప్రిల్ 4 నుంచి అమల్లోకి వచ్చిన ‘ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్- 2025’ ప్రకారం.. గడువు తీరినా ఇక్కడే ఉంటే చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని కేంద్రం పేర్కొంది. వీసా నిబంధనలు ఉల్లంఘించడం, నిషేధిత ప్రాంతాలను సందర్శించడం వంటి సందర్భాల్లో మూడేళ్ల జైలుశిక్ష, రూ.3 లక్షల వరకు జరిమానా విధిస్తామని పాక్ దేశస్థులను హెచ్చరించింది.
వీసాలపై..
మరోవైపు, ఉగ్రదాడి తర్వాత భారత్‌లో ఉన్న పాకిస్థానీయులు ఏప్రిల్ 26లోపు దేశాన్ని వీడాలని కేంద్రం ఇటీవలే ఆదేశించింది. మెడికల్ వీసాల కింద వచ్చినవారికి ఈనెల 29 వరకు గడువు ఇచ్చింది. బిజినెస్, విజిటర్, స్టూడెంట్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్నవారు ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని స్పష్టంచేసింది. దీంతో ఎన్నోఏళ్లుగా భారత్‌లో నివసిస్తున్న పాక్ పౌరులు స్వదేశఆనికి తిరిగి వెళ్తుండటంతో భావోద్వేగానికి గురయ్యారు.






