- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

లక్నో: ఉత్తరప్రదేశ్, ఒడిశా రెండు వేర్వేరు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 11 మంది మరణించారు. మరో ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని కొత్వాలి నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో పేలుడు కలకలం రేపింది. పంట పొలాల మధ్య ఉన్న ఇంటిలో శుక్రవారం బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మరణించారని పోలీసులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసు బృందాలు రెస్క్యూ అపరేషన్లు చేపట్టాయి.
మరణించిన వారిలో ఐదేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు వెల్లడించాయి. సిలిండర్ బ్లాస్ట్ కావడంతోనే ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఒడిశాలో చోటుచేసుకున్న మరో ప్రమాదంలో ఏడుగురు మరణించారు. శుక్రవారం సంబల్ పూర్ జిల్లాలో కారు కాలువలో పడడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో 14 మంది ఉండగా, వారిలో ఇద్దరు గాయపడినట్లు చెప్పారు. పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు.






