- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐదేళ్లలో 65 విమాన ఇంజిన్ వైఫల్యాలు
గత ఐదేళ్లలో భారతదేశ కమర్షియల్ విమానయాన రంగంలో 65 ఇంజిన్ వైఫల్యాలు (in-flight engine failures) చోటు చేసుకున్నట్టు డిజీసీఏ (DGCA) తెలిపింది.

దిశ, వెబ్ డెస్క్: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం ఘోర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలు అప్రమత్తం అయ్యాయి. తమ విమానాల ఇంజిన్‌లు, ఇంధన స్విచ్‌లు వంటి విషయాలపై ఎప్పటికప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) షాకింగ్ విషయాలను వెల్లడించింది. గత ఐదేళ్లలో దేశంలోని విమానయాన రంగంలో 65 ఇంజిన్ వైఫల్యాలు (in-flight engine failures) చోటు చేసుకున్నట్టు DGCA తెలిపింది. సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే, గత 17 నెలల్లో (జనవరి 1, 2024 నుంచి మే 31, 2025) 11 మేడే కాల్స్ నమోదు అయ్యాయి. టెక్నికల్ లోపాలు, ఇంధన కాలుష్యం, ఫ్యూయెల్ ఫిల్టర్ల బ్లాకింగ్, టర్బైన్ లోపాలు, ఫారెన్ ఆబ్జెక్ట్‌లు ఇంజిన్‌లోకి ప్రవేశించడం వంటి కారణాలతో ఈ ఇంజిన్ వైఫల్యాలు జరిగినట్టు వెల్లడించారు. ఈ 11 మే డే కాల్స్ వచ్చినప్పటికీ పైలట్లు చాకచక్యంగా వ్యవహరించటంతో ప్రమాదం తప్పిందని పేర్కొంది.
ఇటీవల ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదం నేపథ్యంలో, డిజీసీఏ స్పందించి బోయింగ్ విమానాల్లోని ఫ్యూయెల్ స్విచ్లను జులై 21 లోపు పరిశీలించి "లాకింగ్ మెకానిజం" అమలు చేయాలని అన్ని ఎయిర్‌లైన్స్‌కు ఆదేశాలు జారీ చేసింది. కాగా, భారత్‌కు చెందిన ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఆకాశ్ ఎయిర్, స్పైస్‌జెట్ వంటి సంస్థలు ప్రస్తుతం బోయింగ్ 787, 737 రకం విమానాలను నడుపుతున్నాయి.






