- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరేళ్ల బాలుడి సూట్ కేస్ లో 14 కిలోల గంజాయి.. విస్తుపోయిన అధికారులు
మారిషస్‌లో డ్రగ్స్ స్మగ్లింగ్‌కు సంబంధించిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వారితోపాటు ఓ 6 ఏళ్ల బాలుడినీ అధికారులు డిటైన్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మారిషస్‌లో డ్రగ్స్ స్మగ్లింగ్‌కు సంబంధించిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వారితోపాటు ఓ 6 ఏళ్ల బాలుడినీ అధికారులు డిటైన్ చేశారు. ఈ బాలుడి ట్రావెల్ బ్యాగులో 14 కిలోల గంజాయి దొరికింది. మొత్తం అరెస్టయిన ఎనిమిది మందిలో ఏడుగురు బ్రిటన్ దేశానికి చెందినవారు కాగా.. మరో వ్యక్తి బ్రిటన్‌లో నివసిస్తున్న రొమేనియన్ జాతీయుడు. ఈ కేసు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.
ఆదివారం బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో గాట్విక్ నుంచి మారిషస్‌కు వచ్చిన ఈ గ్రూప్‌ను సర్ సివుసాగర్ రామ్‌గూలమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఆపారు. మొత్తం వారి లగేజీలో 161 కిలోలకు పైగా గంజాయి దొరికింది. దీనిని స్పష్టంగా సెలోఫేన్ షీట్లలో ప్యాక్ చేశారు. వాటి విలువ సుమారుగా 1.6 మిలియన్ (రూ.18.8 కోట్లు)గా అంచనా వేశారు.
ఈ గ్రూపులో ఉన్న బాలుడి సూట్‌కేసులో 24 డ్రగ్ ప్యాకెట్లు ఉన్నట్లు వెల్లడైంది. అయితే ఈ చిన్నారికి బ్యాగులో ఏముందో తెలియదని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి అతడిని తండ్రి వద్దకు పంపారు. అయితే బాలుడి తల్లి బ్యాగుల్లో కూడా 17 కిలోల డ్రగ్స్ దొరికాయి.
ఇటీవల జరిగిన ఈ అరెస్టుల సమయంలో అధికారులు ఆ గ్యాంగ్ వద్ద 11 ఆపిల్ ఎయిర్‌ట్యాగ్స్‌ను కూడా గుర్తించారు. ఇది యూరప్ నుంచి మారిషస్‌కు డ్రగ్స్ తరలించే అంతర్జాతీయ నెట్‌వర్క్ అని అధికారులు అనుమానిస్తున్నారు. బ్రిటిష్ విదేశాంగ శాఖ ప్రతినిధి ప్రకారం.. మారిషస్‌లో డిటైన్ అయిన తమ దేశ పౌరులకు సాయం అందిస్తున్నామని, సంబంధిత అధికారులతో నిరంతరం టచ్ లో ఉన్నామని తెలిపారు.






