- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాసేపట్లో 56వ GST కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అధ్యక్షతన ఇవాళ ఢిల్లీ (Delhi)లోని తమిళనాడు హౌస్ (Tamilnadu House)లో ఉదయం 9 గంటలకు 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం (56th GST Council Meeting) ప్రారంభమైంది.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అధ్యక్షతన ఇవాళ ఢిల్లీ (Delhi)లోని తమిళనాడు హౌస్ (Tamilnadu House)లో ఉదయం 9 గంటలకు 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం (56th GST Council Meeting) సందర్భంగా అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka), ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav), ఇతర రాష్ట్రాల ఫైనాన్స్ మినిస్టర్లు కూడా హాజరయ్యారు. అనంతరం ఉదయం 11 గంటలకు సుష్మా స్వరాజ్ భవన్‌లో 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది.
ప్రధానంగా ఈ సమావేశంలో పలు కీలక సంస్కరణలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. జీఎస్టీ (GST) రేట్ల సరళీకరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న నాలుగు స్లాబ్‌లు 5 శాతం, 12శాతం, 18 శాతం, 28 శాతం నుంచి రెండు స్లాబ్‌లకు అంటే 5 శాతం 18శాతానికి కుదించే అవకాశం ఉంది. ఆరోగ్య, లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో జీఎస్టీ రేట్ల తగ్గింపు, వినియోగదారులకు ఊరట కలిగించనున్నట్లుగా తెలుస్తోంది. చిరు వ్యాపారాల పర్మీషన్లను సులభతరం చేయనున్నారు. ఇక రాష్ట్రాలకు జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్ (GST Compensation Sess) భవిష్యత్తుపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రత్యేకంగా డ్రోన్‌లకు సంబంధించిన జీఎస్టీ రేట్లపై కూడా ఈ భేటీలో డిస్కస్ చేసి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశం ముగిసిన వెంటనే జీఎస్టీ రేట్ల తగ్గింపు తక్షణమే కేంద్రం అమలు చేయబోతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వేతన జీవులు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. కాగా, గతేడాది జైసల్మేర్ (Jaisalmer) వేదికగా జరిగిన 55వ జీఎస్టీ సమావేశంలో బియ్యం, కిరణా సరుకులపై జీఎస్టీ రేటును 5 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ప్రీ-ప్యాకేజ్డ్ వస్తువుల విషయంలో కూడా కీలక సవరణలు చేశారు.






