- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Punjab: పంజాబ్‌లో రైతుల ఆందోళనలు భగ్నం.. బుల్డోజర్లతో బారికేడ్ల తొలగింపు
గురువారం ఉదయం నుంచి బుల్డోజర్లతో సిమెంటు బారికేడ్లను తొలగిస్తున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: గతేడాది ఫిబ్రవరి నుంచి నిరసనలు నిర్వహిస్తున్న శంభు-ఖనౌరీ సరిహద్దులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది మంది రైతులను పోలీసులు ఖాళీ చేయించారు. నిరసనలను భగ్నం చేసిన అనంతరం, గురువారం ఉదయం నుంచి బుల్డోజర్లతో సిమెంటు బారికేడ్లను తొలగిస్తున్నారు. దీంతో రైతులు నిరసన తెలుపుతున్న ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. శంభు సరిహద్దు వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. బుధవారం రాత్రి కేంద్ర ప్రతినిధులతో సమావేశం ముగిసిన తర్వాత తిరిగి నిరసన ప్రదేశాలకు వెళ్తున్న రైతు నాయకులను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 3,000 మంది పోలీసులను మోహరించిన ఖనౌరీ సరిహద్దులో మహిళలతో సహా 500-700 మంది రైతులను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెలరోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్వాల్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత పంజాబ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిమ్స్)కి తీసుకెళ్లారు. గురువారం ఆయనను జలంధర్‌లోని పీడబ్ల్యూడీ ఆస్పత్రికి తరలించారు. ఇదే సమయంలో హర్యానాలో ఏడాది కాలంగా మూసివేసిన శంభు-అంబాల రహదారిలో ఉన్న కాంక్రీట్ బ్లాక్‌లను తొలగించడానికి జేసీబీలను మోహరించారు. రైతులను ఢిల్లీలోకి రాకుండా పోలీసులు సిమెంట్ దిమ్మెలు, ఇనుప మేకులు, ముళ్ల తీగలను ఉంచారు. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) హామీ ఇచ్చే చట్టంపై వ్యవసాయ మంత్రి శివరాజ్ చౌహాన్ నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధులతో రైతులు ఏడవ రౌండ్ చర్చలు విఫలమైన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. రైతులను ఎంఎస్‌పీపై చర్చలకు పిలిచి, మోసపూరితంగా అరెస్ట్ చేయడం రైతులను ద్రోహం చేయడమేనని కాంగ్రెస్ విమర్శించింది.






