Dantewada: దంతేవాడలో సచిన్ తెండూల్కర్ ఆధ్వర్యంలో 50 మైదానాలు

by Shamantha N |

ఛత్తీస్‌గఢ్‌లోని నక్సలిజంతో ప్రభావితమైన దంతేవాడ జిల్లాలో ఇప్పుడు స్పోర్ట్స్ ఆడేందుకు మైదానాలు నిర్మిస్తున్నారు. కేవలం బాంబులు, ఘర్షణల కథలు వినిపించే ఈ ప్రాంతంలో ఇప్పుడు పిల్లల నవ్వులు, ఆటలు, వ్యాయామాల మార్పు కనిపించనుంది

Dantewada:  దంతేవాడలో సచిన్ తెండూల్కర్ ఆధ్వర్యంలో 50 మైదానాలు
X

దిశ, నేషనల్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజంతో ప్రభావితమైన దంతేవాడ జిల్లాలో ఇప్పుడు స్పోర్ట్స్ ఆడేందుకు సచిన్ టెండూల్కర్ ఆధ్వర్యంలో 50 మైదానాలు నిర్మిస్తున్నారు. కేవలం బాంబులు, ఘర్షణల కథలు వినిపించే ఈ ప్రాంతంలో ఇప్పుడు పిల్లల నవ్వులు, ఆటలు, వ్యాయామాల మార్పు కనిపించనుంది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (sachin tendulkar), మాన్ దేశి ఫౌండేషన్‌తో కలిసి బస్తర్ ప్రాంతంలోని 50 గ్రామాల్లో క్రీడా మైదానాల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ మైదానాలు కేవలం ఆటల కోసం మాత్రమే కాదు, గ్రామీణ యువతకు శారీరక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను అందించడమే లక్ష్యంగా పనిచేయనున్నాయి. క్రికెట్, ఫుట్‌బాల్, కబడ్డీ, ఖో-ఖో, అథ్లెటిక్స్ వంటి క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలు గ్రామస్తులే స్వయంగా నిర్మిస్తున్నారు. ఎలాంటి బయట కాంట్రాక్టర్లను పిలవకుండా, గ్రామ ప్రజలే మైదానాలు తయారు చేసుకుంటున్నారు. ‘ప్రతి మైదానం ఒక మార్పుకు చిహ్నం’ అని ఫౌండేషన్ ప్రతినిధి దివ్య సింహా తెలిపారు. ఇవి గిరిజన సమాజాన్ని ప్రేరేపించడమే కాదు, పిల్లలకు కలలు కనే శక్తిని ఇస్తున్నాయన్నారు.

నైతిక విలువలు క్రమశిక్షణ కోసం

క్రీడలు పిల్లలలో నైతిక విలువలు, క్రమశిక్షణను పెంపొందిస్తాయని సచిన్ టెండూల్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నన్ను నేను ఎలా తీర్చిదిద్దుకున్నానో వారూ కూడా క్రీడల ద్వారా కొత్త ఆశను నింపుకొని ముందుకు సాగాలి. ఈ మార్పు వల్ల మారుమూల గ్రామాల్లో కొత్త తరం నూతన ఆశతో జీవించడం మొదలుపెడతారని సచిన్ అన్నారు. దంతెవాడ, బస్తర్ ప్రాంతం పూర్తిగా నక్సలిజంతో ఎక్కువగా అభివృద్ధి చెందకుండా ఉంది. ఇప్పుడు ఇలా క్రీడా మైదానాల డెవలప్ మెంట్ తో అక్కడి పిల్లల్లో శారీరక, మానసిక మార్పు రావడం ఖాయం. దీంతో పాటు వారు చదువుల్లో రాణిస్తే ఇక వారి మెరుగైన భవిష్యత్తుకు తిరుగుండదు.

Next Story