- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Meerut: ఉత్తరప్రదేశ్ లో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
by Shamantha N |
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఇంటి పైకప్పు కుప్పకూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయారు. శుక్రవారం సాయంత్రం బలమైన తుఫాను రావడంతో ఇంటి పైకప్పు కూలిపోయింది.

X
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఇంటి పైకప్పు కుప్పకూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయారు. శుక్రవారం సాయంత్రం బలమైన తుఫాను రావడంతో ఇంటి పైకప్పు కూలిపోయింది. మీరట్ లోని లిసాడి గేట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన జరిగింది. స్పాట్ లోనే మహిళ సహా ఆమె తొమ్మిది నెలల చిన్నారి చనపోయారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి గాయలైనట్లు అధికారులు తెలిపారు. స్థానికులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. గాయపడిన మరో ముగ్గురు కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. పైకప్పు కూలటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






