- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Floods : వరదల బీభత్సం.. 49 మంది మృతి
దక్షిణాఫ్రికాలోని తూర్పు కేప్ ప్రావిన్స్‌లో భారీ వర్షాలు, వరదలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణాఫ్రికాలోని తూర్పు కేప్ ప్రావిన్స్‌లో భారీ వర్షాలు, వరదలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం.. ఈ వరదల కారణంగా ఇప్పటివరకు 49 మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం, మంచు కారణంగా పరిస్థితి దిగజారింది. ఒక స్కూల్ బస్సు వరదల్లో కొట్టుకుపోయింది. వరదల కారణంగా రవాణా వ్యవస్థ, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ వరదల వల్ల అనేక గ్రామాలు, పట్టణాలు నీటిలో మునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లు, వ్యాపార స్థలాలు, ఆస్తులు ధ్వంసమయ్యాయి. అనేక మంది మరణించగా, మరికొందరు గాయాలతో బాధపడుతున్నారు. రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక వసతులు దెబ్బతినడంతో రవాణా సేవలు స్తంభించాయి. అత్యవసర సేవలు కూడా నిలిచిపోయాయి.
వరదల కారణంగా అనేక కుటుంబాలు తమ నివాసాలను, ఆస్తులను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. చాలా మంది సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. తాగునీరు కలుషితమై, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శాస్త్రవేత్తలు ఈ వరదలకు వాతావరణ మార్పులు ప్రధాన కారణమని, ఇవి మరింత తీవ్రమై విపత్తులకు దారితీస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు.






