- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kishan Reddy: గణనీయమైన పురోగతిలో గనుల రంగం
ప్రధాని మోడీ నాయకత్వంలో దేశంలోని గనుల రంగం ఆధునిక సాంకేతిక వినియోగంతో సంస్కరణలు, పారదర్శకత, సమర్థత దిశగా ముందుకు సాగుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీ నాయకత్వంలో దేశంలోని గనుల రంగం ఆధునిక సాంకేతిక వినియోగంతో సంస్కరణలు, పారదర్శకత, సమర్థత దిశగా ముందుకు సాగుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గ్లోబల్ టెక్నాలజీ, ఎనర్జీ ట్రాన్సిషన్ విషయంలో క్రిటికల్ మినరల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి ఉత్పత్తి, రక్షణ రంగంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. సోమవారం ఢిల్లీలో జరిగిన జాతీయ డీఎంఎఫ్సదస్సు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. క్రిటికల్ మినరల్స్‌కు 7వ విడత వేలం ప్రక్రియ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, మొత్తం 19 బ్లాక్స్‌కు వేలం వేస్తున్నామన్నారు. ఇప్పటివరకు జరిగిన 6 విడతల్లో మొత్తం 46 క్రిటికల్ మినరల్ బ్లాక్స్‌ను విజయవంతంగా వేలం నిర్వహించాం. ఈ వేలంలో తొలిసారిగా నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రస్ట్ గుర్తించిన బ్లాక్స్‌ను కూడా చేర్చామన్నారు.
గణనీయమైన పురోగతి..
గనుల రంగం తక్కువ కాలంలోనే గణనీయమైన పురోగతి సాధించింది. ఈ ప్రయాణంలో ప్రైవేటు రంగం కూడా ఎంతో కీలక పాత్ర పోషించింది. అభివృద్ధి అనేది సమతుల్యంగా ఉండాలి. పర్యావరణానికి నష్టం కలగకుండా ఉండేలా చూడాలి. గనుల వల్ల ప్రభావితమయ్యే స్థానిక ప్రజలకు అభివృద్ధి ద్వారా లాభం చేకూరాలనే ఉద్దేశంతో జిల్లాల మినరల్ ఫౌండేషన్లు స్థాపించామన్నారు. గనులకోసం తమ స్థలాలను ఇచ్చేసిన స్థానికుల సంక్షేమం మనందరికి ప్రాధాన్యత కావాలి. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ద్వారా వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడం, గనుల ప్రభావిత ప్రాంతాల్లో విద్య, వైద్యం వంటి కనీస అవసరాలను కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. ముఖ్యంగా యాస్పిరేషనల్ జిల్లాల్లో ప్రత్యేకమైన వ్యూహాలతో పనిచేయాల్సిన అవసరం ఉంది. గతేడాదిలో డీఎంఎఫ్కార్యక్రమాన్ని ప్రారంభించామని, జిల్లాల మినరల్ ఫౌండేషన్ల అనుసంధానం చేసి చాలా వెనుకబడిన ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దేశంలోని 23 రాష్ట్రాల్లో 656 జిల్లాల్లో డీఎంఎఫ్లు ఏర్పాటయ్యాయి. గనుల మూత అనేది చాలా ప్రాధాన్యమైన అంశం. 2025 నాటికి 147 గనులను శాస్త్రీయంగా మూసేయాలన్న లక్ష్యం పెట్టుకున్నాం. ఆ తర్వాత ఈ ప్రాంతాల్లో సుస్థిరమైన అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు.






