- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాపం.. చెయ్యని తప్పుకు 43 ఏళ్ల జైలు
by Muthe.Rajitha |
ఎలాంటి నేరం చేయకపోయినా ఓ వ్యక్తి 43 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు.

X
దిశ, వెబ్ డెస్క్ : ఎలాంటి నేరం చేయకపోయినా ఓ వ్యక్తి 43 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు. వందమంది దోషులు తప్పించుకున్నా.. ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు’ అని చట్టాలు చెబుతుంటాయి. కానీ USలోని భారత సంతతి వ్యక్తి సుబ్రహ్మణ్యం వేదం.. చేయని తప్పుకు 4 దశాబ్దాలకు పైగా జైలు శిక్ష అనుభవించారు. 1980లో హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుపాలయ్యారు సుబ్రహ్మణ్యం. ఆ హత్య కేసులో అతని ప్రమేయం లేదని ఆయన ఇటీవలే నిర్దోషిగా విడుదల చేసింది కోర్టు. అయితే అలా విడుదలైన వెంటనే దశాబ్దాల పాత డ్రగ్స్ కేసులో ఇమిగ్రేషన్ అధికారులు మళ్లీ ఆయన్ను అరెస్ట్ చేయడంతో కోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కేసును నిలిపివేసి సుబ్రహ్మణ్యంకు తాత్కాలిక ఊరటనిచ్చింది.
Next Story






