రష్యాలో క‌త్తి పోట్ల క‌ల‌క‌లం..న‌లుగురు భార‌తీయ విద్యార్థుల‌కు గాయాలు

by velandi.Saikiran |

రష్యాలో మరో దారుణం జరిగింది. భారత స్టూడెంట్స్ పై కత్తితో దాడి జరిగినట్లు తెలుస్తోంది.

Four Indian students injured in knife fight in Russia
X

Four Indian students injured in knife fight in Russia

దిశ‌, వెబ్ డెస్‌: రష్యాలో మరో దారుణం జరిగింది. భారత స్టూడెంట్స్ పై కత్తితో దాడి జరిగినట్లు తెలుస్తోంది. రష్యా ఉఫాలోని ఓ ప్రముఖ కాలేజీలో యువకుడు కత్తితో వీరంగం సృష్టించాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విచక్షణారహితంగా అతడు దాడి చేశాడట. ఈ పెను ప్రమాదంలో నలుగురు భారతీయ విద్యార్థులతో పాటు రష్యాకు చెందిన పలువురు గాయపడినట్లు అధికారులు ప్రకటన చేశారు.

న‌లుగురు భార‌తీయ విద్యార్థుల‌కు గాయాలు

ఈ ఘోర‌ ప్రమాదంలో నలుగురు భారతీయ విద్యార్థులు గాయపడ్డారని ఇటు ఇండియన్ ఎంబసీ కూడా స్పష్టం చేసింది. దీనిపై ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని వెల్లడించింది. ఈ ప్రమాదం నేపథ్యంలో అధికారులతో టచ్ లో ఉన్నట్లు వివరించింది ఇండియన్ సర్కార్. విద్యార్థులకు అవసరమైన సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అటు దాడికి పాల్పడిన వ్యక్తిని స్థానిక అధికారులు అరెస్టు కూడా చేశారు. అయితే ఆ దాడి చేసిన వ్యక్తికి మానసిక పరిస్థితి బాగాలేదని తెలుస్తోంది.

Next Story