ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో సోదాలు.. భారీగా ఆస్తులు గుర్తింపు

by Naga Rani Yarlagadda |

సీనియర్ ఐఆర్‌ఎస్ అధికారి అమిత్ కుమార్ సింఘాల్ (Amith kumar singhal Arrest) అవినీతి ఆరోపణలపై అరెస్టయ్యాడు. సీబీఐ (CBI) అధికారులు అతనికి చెందిన ఇళ్లలో సోదాలు నిర్వహించి, భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు, వెండి, గోల్డ్ కాయిన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో సోదాలు.. భారీగా ఆస్తులు గుర్తింపు
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ ఐఆర్‌ఎస్ అధికారి అమిత్ కుమార్ సింఘాల్ (Amith kumar singhal Arrest) అవినీతి ఆరోపణలపై అరెస్టయ్యాడు. సీబీఐ (CBI) అధికారులు అతనికి చెందిన ఇళ్లలో సోదాలు నిర్వహించి, భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు, వెండి, గోల్డ్ కాయిన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

2007 బ్యాచ్‌కు చెందిన అమిత్ కుమార్ సింఘాల్ దిల్లీలోని డైరెక్టర్ ఆఫ్ టాక్స్‌పేయర్ సర్వీసెస్‌లో అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నాడు. లంచం కోసం ఇన్‌కమ్ టాక్స్ నోటీసు నుంచి తప్పించుకునేందుకు రూ.45 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న అమిత్ కుమార్ సింఘాల్‌ను సీబీఐ అధికారులు రెండు రోజుల క్రితం (శనివారం) అరెస్ట్ చేశారు. అతని సహాయకుడు హర్ష్ కొటక్ మోహాలీలోని నివాసంలో రూ.25 లక్షలు తీసుకుంటూ దొరికిపోయాడు. దీంతో సీబీఐ అధికారులు అమిత్‌పై కేసు నమోదు చేసి, అతన్ని అదే రోజు అరెస్ట్ చేశారు.

అనంతరం అమిత్‌కు చెందిన పలు నివాసాల్లో సోదాలు చేపట్టగా, 3.5 కేజీల బంగారు ఆభరణాలు, గోల్డ్ కాయిన్స్, రూ.1 కోటి నగదు, ఒక లాకర్, 25 బ్యాంకు ఖాతాలు, దిల్లీ, ముంబై, పంజాబ్‌లోని చర, స్థిరాస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అమిత్, అతని సహాయకుడిని కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు.

Next Story