కర్ణాటక జూలో 31 జింకలు మృతి

by Muthe.Rajitha |   (  Updated:2025-11-17 15:33:59  IST  )

కర్ణాటకలోని ఓ జూలో 31 కృష్ణ జింకలు మృతి చెందడం కలకలం రేపింది.

కర్ణాటక జూలో 31 జింకలు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటకలోని ఓ జూలో 31 కృష్ణ జింకలు మృతి చెందడం కలకలం రేపింది. కిత్తూరు రాణి చెన్నమ్మ జూలో గత 4 రోజుల్లో 31 కృష్ణ జింకలు మృతి చెందాయి. అయితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్లే చనిపోయాయని జూ అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే దర్యాప్తుకు ఆదేశించారు. జింకలకు ఇన్ఫెక్షన్ సోకడంతో జూ అధికారులు, వెటర్నరీ వైద్యులు సాధారణ ట్రీట్మెంటు అందించారని చెప్పారు.

బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఇతర జంతువులకు అది వ్యాపించకుండా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. బాక్టీరియా వ్యాప్తికి కారణం తెలుసుకొనేందుకు నిపుణుల బృందాన్ని పంపామన్నారు. ఇక జింకల మృతితో జూ పార్క్ లోకి సందర్శకులను ఎవరినీ అనుమతించడం లేదు. తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా జూ ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించారు.

Next Story