- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Israel: 3800 ఏళ్ల క్రితం నాటి అరుదైన వస్తువును కనుగొన్న 3 ఏళ్ల చిన్నారి
కుటుంబంతో విహరయాత్ర వెళ్లిన ఓ చిన్నారి ఓవర్ నైట్ స్టార్‌గా మారింది.

దిశ, వెబ్ డెస్క్: కుటుంబంతో విహరయాత్ర వెళ్లిన ఓ చిన్నారి ఓవర్ నైట్ స్టార్‌గా మారింది. వారు వెళ్లిన ప్రదేశంలో అరుదైన పురాతన వస్తువును కనుగొనటంతో ఆ చిన్నారి ప్రశంసలు అందుకుంది. ఈ సంఘటన ఇజ్రాయోల్ (Israel) దేశంలో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. దక్షిణ ఇజ్రాయోల్‌లోని తెల్ అజెకా అనే పురాతన ప్రాంత సందర్శనకు జివ్ నిట్జాన్ (Ziv Nitzan) అనే మూడేళ్ల చిన్నారి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లింది. అక్కడ తన తోబుట్టువులతో ఆడకుంటుండగా ఓ రాయి ప్రత్యేకంగా కనిపించటంతో సేకరించింది. అనంతరం దానిని ఆ చిన్నారి తల్లిదండ్రులకు చూపించగా వారు పురాతన వస్తువుగా గుర్తించి, ఇజ్రాయోల్ పురావస్తు అథారిటీ (IAA)కు అప్పగించారు.
పురావస్తు శాఖ వారు ఆ రాయిని పరిశీలించి, అది 3800 ఏళ్ల క్రితం నాటి ఈజిప్టియన్ (Egyptian) స్కార్బ్‌గా(సీల్డ్ ముద్ర) గుర్తించారు. అనంతరం అరుదైన వస్తువును బాధ్యతగా ప్రభుత్వానికి అందించినందుకు జివ్ నిట్జాన్‌కు పురావస్తు శాఖ తరపున ప్రశంసా పత్రాన్ని కూడా అందజేశారు. ఈ వస్తువును మ్యూజియంలో భద్రపరిచనున్నట్లు తెలిపారు. ఇక ఈ స్కార్బ్ ఈజిప్ట్-కనాన్ (Egyptian and Canaanite) సంబంధాలను చూపిస్తుందని, ఈజిప్ట్‌లో తయారైన ఈ వస్తువు పవిత్ర బీటిల్ చిహ్నంగా, మత విశ్వాసాలను ప్రతిబింబిస్తుందని పురావస్తు నిపుణురాలు డాఫ్నా బెన్-టోర్ తెలిపారు. అలాగే, తెల్ అజేకా ప్రాంతం కాంస్య యుగంలో కీలక నగరంగా ఉండేదని చెప్పారు.






