- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
27కు చేరిన జమ్మూకశ్మీర్ మృతుల సంఖ్య.. శ్రీనగర్‌కు బయల్దేరిన అమిత్ షా
జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లో జరిగిన ఉగ్రదాడి దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లో జరిగిన ఉగ్రదాడి దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. వేసవి సెలవుల వేళ విహారయాత్రకు వచ్చిన టూరిస్టులపై ఉగ్రమూకలు(Terror Attack) కాల్పులు జరపడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ కాల్పుల్లో మొత్తం 27 మంది టూరిస్టులు మృతిచెందారు. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాకారం. కశ్మీర్ టూరిస్టులపై కాల్పులు జరిపింది తామేనని టీఆర్ఎఫ్ సంస్థ ప్రకటించడం మరింత దుమారం రేపుతోంది. మరోవైపు ఈ ఘటనపై ఆరా తీసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Modi).. వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah)కు కాల్ చేసి కాల్పులు జరిగిన చోటుకు వెళ్లాలని ఆదేశించారు. కాగా, శ్రీనగర్(Srinagar) వెళ్లిన వెంటనే అత్యవసర భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉగ్రవాద చర్యలో పాల్గొన్న వారిని వదిలిపెట్టబోము ఇప్పటికే హెచ్చరించారు. నేరస్థులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ఈ ఘటనను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం ఖండించారు అమాయక పౌరులపై దాడికి పాల్పడిన వారిని వదిలి పెట్టబోమని తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఈ ఘటన వెనుక ఉన్నవారిని న్యాయస్థానం ముందు నిలబెడుతామని ప్రకటించారు.






