పెళ్లి కోసం వచ్చి.. యూఎస్‌లో భారతీయురాలు మిస్సింగ్!

by Phanindra |   (  Updated:2025-06-29 13:24:37  IST  )

పెళ్లి కోసం యూఎస్ వచ్చిన భారతీయురాలు. న్యూజెర్సీలో మిస్సింగ్. కుటుంబాన్ని సంప్రదించలేకపోయామన్న పోలీసులు.

పెళ్లి కోసం వచ్చి.. యూఎస్‌లో భారతీయురాలు మిస్సింగ్!
X

దిశ, నేషనల్ బ్యూరో: పెద్దలు కుదిర్చిన పెళ్లి కోసం అమెరికా వచ్చిన 24 ఏళ్ల భారతీయులు కనిపించకుడా పోయింది. ఈ ఘటన న్యూజెర్సీలో జరిగింది. సదరు మహిళను సిమ్రన్‌గా పోలీసులు గుర్తించారు. సీసీఫుటేజీలో తన ఫోన్ చెక్ చేసుకుంటూ, ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లు సిమ్రన్ కనిపించిందని అధికారులు తెలిపారు. కనిపించకుండా పోవడానికి ముందు సిమ్రన్‌ ఏమాత్రం ఆందోళనలో కనిపించలేదని చెప్పారు. జూన్ 20వ తేదీన భారత్ నుంచి యూఎస్‌కు సిమ్రన్ వచ్చింది.

5 అడుగుల 4 అంగుళాల ఎత్తున్న ఆమె 68 కేజీల బరువుంటుందని, నుదుటి మీద చిన్న గాయం మచ్చ ఉందని పోలీసులు తెలియజేశారు. అసలు సిమ్రన్ పెళ్లి కోసమే యూఎస్ వచ్చిందా? అనే అనుమానాలు కూడా అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు కనీసం ఇంగ్లీషు మాట్లాడటం కూడా రాదని, యూఎస్‌లో ఆమెకు తెలిసిన వాళ్లు కూడా ఎవరూ లేరని వాళ్లు చెప్తున్నారు. ఆమె ఫోన్ కూడా కేవలం వైఫైతో మాత్రమే పనిచేస్తుందని, దీంతో ఆ మొబైల్‌ను కూడా ట్రేస్ చేయలేకపోతున్నామని పేర్కొన్నారు. భారత్‌లో ఆమె కుటుంబాన్ని సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని తెలిపారు.

Next Story