ఘోర ప్రమాదం.. జాయింట్ వీల్ కిందపడి 23 మందికి తీవ్ర గాయాలు.. (వీడియో)

by Sujitha Rachapalli |

ఘోర ప్రమాదం.. జాయింట్ వీల్ కిందపడి 23 మందికి తీవ్ర గాయాలు.. (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తైఫ్‌లోని గ్రీన్ మౌంటైన్ పార్క్‌లో 360 డిగ్రీస్ అమ్యూజ్‌మెంట్ రైడ్ విషాదానికి దారితీసింది. గాలిలో ఉండగానే విరిగిపోవడంతో 23 మంది గాయపడగా.. పరిస్థితి విషమంగా ఉంది. కాగా అమ్యూజ్‌మెంట్ రైడ్ ఎంజాయ్ చేస్తుండగానే... మధ్యకు విరిగిపోయి.. కింద పడిపోయింది. విరిగిపడిన స్తంభం అతివేగంగా రైడర్లను, అక్కడ నిలబడిన వారిని బలంగా ఢీకొనడంతో.. తీవ్ర గాయాలయ్యాయి. సేఫ్టీ మెజర్మెంట్స్ ఎక్కువగా ఉండటంతో ప్రాణ నష్టం తగ్గింది. అత్యవసర సేవలు కొనసాగుతుండగా.. బాధితులను ట్రాక్ చేసేందుకు తైఫ్‌లోని ఆసుపత్రులు కోడ్ ఎల్లోను ప్రకటించాయి. మరోవైపు అధికారులు పార్క్‌ను మూసివేసి.. ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించారు. సేఫ్మీ మెజర్మెంట్స్‌ను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీ వేయబడింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

VIDEO

Next Story